ఏపీ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాం-మోదీ 11 h ago
AP: ఏపీ ప్రజల ప్రేమ, అభిమానానికి ప్రధాని నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంపై అభిమానం చూపే అవకాశం ఇప్పుడు లభించిందని చెప్పారు. ఏపీ అభివృద్ధి మా విజన్..ఏపీ ప్రజల సేవే మా సంకల్పం అని అన్నారు. ఏపీ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించామని మోదీ వెల్లడించారు. చంద్రబాబు పెట్టుకున్న లక్ష్యాలకు అండగా ఉంటామన్నారు. ఐటీ, సాంకేతికతకు ఏపీ కేంద్రంగా మారింది, 2030 నాటికి 5 మిలియన్ మెట్రిక్ టన్నుల..గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి లక్ష్యమని ప్రధాని మోదీ పేర్కొన్నారు.